ఒక సభ్యుని అభ్యర్ధన : — స్వాధీనపు తనఖా దస్తావేజు నమునా కావాలి సార్
కాకినాడ ప్రసాద్ గారి సూచన :–
స్వాధీనపు తనఖా కండిషన్స్ ఏమిటో ఒక లైన్ లో వ్రాసుకోండి. అదే నమూనా.
ఎన్ని సంవత్సరాలలో బాకీ తీరుస్తారు ? వడ్డీ రేటెంత ? ఆస్ధి నుండి వచ్చే ఆదాయం వడ్డీకి సరిపోతుందా ? సరిపోకపోతే మిగతా వడ్డీని ఎలా చెల్లిస్తారు అసలు సొమ్ము ఎన్ని సంవత్సరాలలో చెల్లిస్తారు ? అనుకున్న టైం కంటే ముందుగా చెల్లించేస్తే ఏమిటి ? అసలు ఎప్పటికీ చెల్లించకపోతే ఏమిటి ? ఏదో వడ్డీ వస్తుందని అప్పు యిస్తే ,ఆస్ధి నుండి ఏమీ ఆదాయం రాకముందే ( అంటే పంట చేతికి రాకుండానే ) బాకీ తీర్చేస్తే ఏమిటి ? యివన్నీ పూర్తిగా మీలో మీలో ప్రశ్నించుకోండి. అదే మంచినమూనా అవుతుంది.
25-11-2021 గురువారం
ఒక ముస్లీం ఆస్తి యందలి 1/6వ వంతు అతని తండ్రికి మరియు 1/6వ వంతు తల్లికి సంక్రమించి మిగిలిన 4/6 వంతుల ఆస్తి లోని 2/3 వంతులు జీవిత కుమారునికి శేషించిన 1/3వ వంతు కుమార్తెకు సంక్రమిస్తుంది. దివంగత కుమారుని భార్యా పిల్లలకు గాని, జీవిత కుమారుని యొక్కయు కుమార్తె యొక్కయు సంతతికి గాని ఎలాంటి హక్కులు ఉండవు.